5 March, 2026 | 5:21 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

రూ.5వేలు తగ్గిన వెండి

19-02-2026 02:54 AM

హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,64,900

హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో బుధవారం సుమారు రూ. 2,64,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారంతో పోలిస్తే వెండి ధర కిలోకు దాదాపు రూ.5,000 వరకు తగ్గింది. అయితే భాగ్యనగరంలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కన్పించలేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,54,200 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం స్వచ్ఛమైన పసిడి ధరలో ఎలాంటి పెరుగుదల కన్పంచలేదు. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల వీటి ధరలు దేశీయంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు దాదాపు రూ.5వేల వరకు తగ్గి రూ.2,64,900 చేరింది. మంగళవారంతో పోలిస్తే.. వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. పసిడి ధరల తగ్గుదల కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో తగ్గిన ధరలు కొనుగోలుదారులకు కొంత కలిసివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.