22-02-2026 12:33:13 AM
మారుతి సుజుకి నుంచి మొట్టమొటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (విజయక్రాంతి): మారుతి సుజుకి నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఇ శనివా రం వరుణ్ నెక్సా సైనిక్‌పురి షోరూమ్‌లో ఘనంగా ఆవిష్కరించారు. మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ నూతన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరిం చా రు. ఈ కార్యక్రమంలో వరుణ్ నెక్సా ఉన్న తాధికారులు దేబ్జ్యోతి దత్తా, యోగేష్ గుప్తా, ఆర్‌సీ రాజు, ఆర్‌వీ నిరంజన్, శ్రీధర్ పాల్, బ్రాంచ్ హెడ్ సాయిరాం పాల్గొన్నారు.
అద్భుతమైన రేంజ్: ఇవిటరా ఒక పూర్తి ఛార్జింగ్‌తో 543 కి.మీ వరకు ప్రయా ణిస్తుం ది. ఇది 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో అందు బాటులో ఉంది. స్మార్ట్ ఫీచరు..10.1-అంగు ళాల ఇన్ఫోటైన్మెం ట్, లెవల్ 2 ఏడీఏఎస్ సేఫ్టీ, 7 ఎయిర్‌బ్యా గ్లు, సరికొత్త లగ్జరీ ఇంటీరి యర్స్‌తో ఈ ఎస్ యూఐ రూపుదిద్దుకుంది. ధర: రూ.15.99 లక్షల నుంచిరూ.19.79 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).
ప్రత్యేక ఆఫర్లు (నెక్సా ఈఎడ్జ్ e):ప్రారంభ ఆఫర్ కింద మార్చి 31, 2026 వరకు బుక్ చేసుకునే కస్టమర్లకు రూ.50,000 విలువైన ఫ్రీ ఛార్జర్ అండ్ ఇన్స్టాలేషన్, ఒక ఏడాది ఉ చిత ఛార్జింగ్,8 ఏళ్ల బ్యాటరీ వారంటీ వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలను సంస్థ ప్ర కటించింది.ప్రస్తుతం షోరూమ్‌లో టెస్ట్ డ్రై వ్‌లు, బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.