26 July, 2026 | 5:25 PM

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు

26-07-2026 04:54 PM

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమాత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner V.C. Sajjanar) ఆదివారం పేర్కొన్నారు. రూ.10 వేలు ఈఎండీ చెల్లింపుల పేరుతో నకిలీ కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని, డబ్సులు చెల్లిస్తే ఇళ్లు ఇప్పిస్తామంటూ చెప్పేవాళ్ల మాటలు నమ్మొద్దు అని సజ్జనార్ తెలిపారు. ఈ రోజే చివరి తేదీ అంటూ భయపెట్టి డబ్బులు కాజేసేస్తున్నారని, 

నేరరహిత, సురక్షితమైన హైదరాబాద్ కోసం ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అవకాశం దొరకకపోతే నేరస్తులు ప్రవేశించలేరని, తరచుగా వ్యక్తుల నిర్లక్ష్యమే నేరాలకు ఆస్కారం కల్పిస్తుంది. ఇంటి పని కోసం సహాయకులను నియమించుకునే ముందు వారి వివరాలను సరిగ్గా సరిచూసుకోవడం, నేపథ్య తనిఖీలు చేయడం తప్పనిసరి అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, ఏదైనా అనుమానాస్పద కదలికలు, ఇంటి తాళాలు పోవడం లేదా ఇంటి పనివారు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం వంటివి జరిగితే, వెంటనే 'డయల్ 100'కు కాల్ చేయడం, హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 94906 16555కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు.