26 July, 2026 | 5:51 PM

యువతకు హమీలిచ్చి మోసం చేసిన చరిత్ర మీది

26-07-2026 05:18 PM

హైదరాబాద్: విద్యార్థుల విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది అని, ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయమని కవిత హెచ్చరించారు. 

36 రోజుల పాటు ఉద్యమం చేసి కేంద్రం దిగి వచ్చేలా విద్యార్థులు పోరాటం చేశారని, తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన స్థితి తెచ్చారు. వెయ్యి శాతం ఇది విద్యార్థులు సాధించిన ఘన విజయం అని కవిత గుర్తు చేశారు. ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించటం సిగ్గుచేటు అని, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ను విద్యార్థులు ఎక్కడ నిలదీస్తారోనని, విద్యార్థుల ఘనతను తాము సాధించినట్లు నాలుగు గంటల పాటు నగర వీధుల్లో ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నాయకులు ముందుగానే కొవ్వొత్తుల ర్యాలీ ఊరేగింపు చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యూత్ ను పట్టించుకోని ముఖ్యమంత్రి 21 ఏళ్లుకే యువత పార్లమెంట్ లో ఉండేలా బిల్లు తెస్తామని చెబుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు.