సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ బృందం భేటీ

16-09-2026 | 01:28pm

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు  చెందిన ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ(Singapore Delegation) భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు(Singapore) ప్రకటించారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్(Gandhi Sarovar) వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో(Musi Riverfront Development) పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి సూచించారు.

హైదరాబాద్ ను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్న సీఎం

హైదరాబాద్ నగరాన్ని పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్(Knowledge Hub)గా తీర్చి దిద్దుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని సీఎం తెలిపారు.  భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.  తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక పరమైన సహకారం అందించాలని కోరారు.

పెట్టుబడులకు అన్నిరకాలుగా ప్రజా ప్రభుత్వం సహకరిస్తోందని హామీ ఇచ్చారు. పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులు  సానుకూలంగా స్పందించినట్లు సీఎం స్పష్టం చేశారు. డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Telangana Global Summit)కు సింగపూర్ ప్రతినిధులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు