59వ ఇంజనీర్స్ డే వేడుకలలో పాల్గొన్న సింగరేణి అధికారులు

15-09-2026 | 11:46pm

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166వ జయంతి వేడుకలు

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి  సివిల్ డిపార్ట్మెంట్(Singareni Civil Department) ఆధ్వర్యంలో, హెడ్డాఫీస్ ఎదురుగా  మోక్షగుండం  విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి, 166వ జయంతి, 59వ ఇంజనీర్స్ డే వేడుకల(Engineers Day celebrations)ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో  సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్)  ఎల్వి సూర్యనారాయణ, డైరక్టర్(ఈ&ఎం)  ఎం.తిరుమల రావు, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొని  మోక్షగుండం విశ్వేశ్వరయ్య(Mokshagundam Visvesvaraya) కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వక్తలు అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ,  మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా నిరాడంబరమైనటువంటి స్థాయి నుంచి ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లలో ఒకరుగా ఎదగడం భారతదేశానికి ఎంతో గర్వకారణం అన్నారు. ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి  విశ్వేశ్వరయ్య  జన్మదినాన్ని, ఇంజనీర్స్ డేగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. యువత  మోక్షగుండం విశ్వేశ్వరయ్యని స్ఫూర్తిగా తీసుకొని ఇంజనీరింగ్ లో ప్రగతిని తీసుకురావడానికి తమ వంతు కృషి చేయడానికి పూనుకోవాలన్నారు. 

ప్రతీ ఏడాది ఒకొక్క థీమ్ తో ఈ యొక్క ఇంజనీర్స్ డే చేసుకుంటున్నామని, ఈ ఏడాది "ఆవిష్కరణ, డిజిటలైజేషన్ ద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం స్మార్ట్ ఇంజనీరింగ్" (Smart engineering for a sustainable future through innovation and digitalization) అనే థీమ్ తో నిర్వహించుకుంటున్నామని ఇంజనీర్లు ఆధునిక  టెక్నాలజీలను ఉపయోగిస్తూ, నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించి భావి తరాలకు అందించి, భారత దేశ అభివృద్దికి పాటుపడాలని తెలిపారు. సివిల్ డిపార్ట్మెంట్  ఇంచార్జ్ జి‌ఎం(సివిల్) ఆర్.సతీష్ బాబు  అధ్యక్షతన  జరిగిన  ఈ కార్యక్రమంలో జి‌ఎంలు, వివిధ విభాగాల ఇంజనీర్లు,  అధికారులు యూనియన్ నాయకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు