ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దూకుడు
24-06-2025 11:59 AM
- నిందితుడు, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్న సిట్.
- ఇవాళ సిట్ ముందు హాజరుకానున్న ఎంపీ ఈటల రాజేందర్.
- హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణ.
- ఇప్పటికే ప్రభాకర్‌రావును పలుమార్లు ప్రశ్నించిన సిట్.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ అధికారులు నిందితుల స్టేట్ మెంట్ తో పాటు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఎస్ఐబీ(Former SIB chief T Prabhakar Rao) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ఐదు సార్లు విచారించారు. మరో నిందితుడు పణీత్ రావును సిట్ బృందం మూడు సార్లు విచారించింది. సాక్షులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు వాంగ్మూలాలు నమోదు చేసింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి సిట్ ముందు హాజరై సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు.






