మాల్‌తుమ్మెద గ్రామ శివారులో, అర్హులైన లబ్ధిదారులకు పట్టా పాస్‌పుస్తకాలు అందించాలి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి, ప్రతి చిన్న పంచాయతీకి కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి జులై 16 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తుతుందని ప్రతి గ్రామపంచాయతీ పల్లెటూర్లలో ప్రతి గల్లీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మదన్మోహన్ జిల్లా కలెక్టర్ తో అన్నారు.
అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట పలు మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యంగా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామంలో, 268, 834 838 సర్వే నంబర్ లో గల అర్హులైన లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేయాలని అర్హులైన వారిని గుర్తించి వారికి పాసుపుస్తకాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ వినతిపత్రం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ మరియు అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.






