గణేష్ నిమజ్జనంలో విషాదం... ఆరుగురు మృతి
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్‌చెరు మండలంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. వినాయక చవితి ఉత్సవాల్లో(Vinayaka Chavithi celebrations) భాగంగా విగ్రహ నిమజ్జనం కోసం విద్యార్థులు పెద్ద కంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులోకి దిగారు. అయితే, చెరువు లోతుపై అవగాహన లేకపోవడం, పైగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయ్యారు. అది గమనించిన స్థానికులు చెరువులోంచి విద్యార్థులను బయటికి తీసి ఆసుపత్రికి తరించారు.
విద్యార్థులు అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృదేహలను స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు. మరణించిన విద్యార్థులంతా స్థానిక శిరీష చారిటబుల్ ట్రస్ట్(Sirisha Charitable Trust)కు చెందిన వారని, మృతులు నరసింహ (21), తేజ (17), సిద్ధార్థ (17) గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంతో పెద్ద కంజర్ల గ్రామంలో శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.