24 June, 2026 | 3:55 AM

చిన్నారిపై అత్యాచారం

14-06-2024 07:53 PM

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో దారుణం జరిగిం. అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన సుల్తానాబాద్ మండలం, కాట్నపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామానికి చెందిన మహేష్ అతన కుటుంబం కాట్నపల్లి వద్ద ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నారు. అదే మిల్లులో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బలరాం అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రాత్రి సమయంలో తల్లి తన ఆరేళ్ల చిన్న తన పక్కల పడుకోబేట్టుకొని నిద్రిస్తుంది. డ్రైవర్ బలరాం బాలకను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యచారం చేసి హత్య చేశాడు. తల్లి నిద్రలో నుంచి లేచి చూస్తే బాలిక పక్కన కనిపించాలేదు. తల్లి, మిల్లులోని కార్మికులు చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మిల్లులో ఉన్న సీసీ టీవీ కెమెరాను చూడగా... డ్రైవర్ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు, కార్మికులు నిందితుణ్ని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.