24 June, 2026 | 5:09 AM

రికార్డులు పక్కాగా ఉండాలి : కలెక్టర్

14-06-2024 05:10 PM

మహబూబ్ నగర్: రికార్డు పక్కగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహబూబ్ నగర్ రూరల్ తహశీల్దార్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో రికార్డు లు పరిశీలించారు. ధరణి దరఖాస్తుల పెండింగ్ పై సమీక్షించారు. ధరణి దరఖాస్తులు పరిష్కారంపై  సమీక్షించి తహశీల్దార్ కు సూచనలు చేశారు. ప్రజల సమస్యల పట్ల రోజు సమీక్ష చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.