24 June, 2026 | 2:44 AM

భూ తగాదాలో వ్యక్తి మృతి.. ఎస్సై సస్పెండ్

14-06-2024 10:32 PM

నారాయణపేట : జిల్లా కేంద్రంలో పోలీసుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భూ తగాదాలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన ఊట్కూరు మండలంలోని చిన్నపోర్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. అందరు చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కొంతమంది విచక్షణ రహితంగా కర్రలతో కొట్టారు. దీంతో 100 కు డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉట్కూరు ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణం జరిగిందని బాధితులు ఆరోపించారు. దీంతో శాంతి భద్రతలు పరిరక్షించడంతో విఫలమైన ఉట్కూర్ ఎస్సై బి శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సంధర్బంగా ఎస్పీ హెచ్చరించారు.