తొలి రోజు సభకు దూరం.. నేడు హాజరవుతారా?

08-09-2026 | 08:45am

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) వర్షాకాల సమావేశాల తొలి రోజున మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ(Konda Surekha) సభకు హాజరు కాలేదు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొద్ది రోజులకే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఆమె సభకు వస్తారా? లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో సాధారణ ఎమ్మెల్యేగా ఆమెకు అసెంబ్లీలో వెనుక వరుసలో సీటు కేటాయించారు. అయితే తొలి రోజు సమావేశాలకు దూరంగా ఉన్న సురేఖ.. రెండో రోజు సభకు హాజరవుతారా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో ఆమె నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు