పేదల బియ్యంపై అక్రమ రవాణా ముఠా కన్ను

11-09-2026 | 05:10am
  1. డీసీఎంలో 290 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత

143.10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.. డ్రైవర్ ముజీబ్ అరెస్టు

చంద్రాయణగుట్ట నుంచి కొనుగోలు.. బోధన్‌కు తరలిస్తుండగా పోలీసుల వల 

కొల్చారం, సెప్టెంబరు 10: పేదల కడుపు నింపాల్సిన ప్రభుత్వ బియ్యంపై అక్రమ రవాణా ముఠా (Smuggling gang) కన్నేసింది. రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయించేందుకు సాగుతున్న దందాకు కొల్చారం పోలీసులు చెక్ పెట్టారు. పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది.

ఎస్త్స్ర మొహమ్మద్ మోహినుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా KA-32-AA-4947 నంబరు గల డీసీఎం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్‌ఆర్కే)తో కలిపి 290 బస్తాల్లో 143.10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ ముజీబ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ దందా గుట్టు రట్టయినట్లు పోలీసులు తెలిపారు.

చంద్రాయణగుట్ట నుంచి కొనుగోలు

చంద్రాయణగుట్ట ప్రాంతంలోని రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, మెదక్ మీదుగా బోధన్కు తరలించి అక్కడ అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ముజీబ్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. బియ్యంతో పాటు పట్టుబడిన డీసీఎం కూడా తనదేనని అతడు చెప్పినట్లు పేర్కొన్నారు.

కేసు నమోదు

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, తెలంగాణ స్టేట్ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్2016లోని క్లాజ్ 17(ఈ)కు విరుద్ధమని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ముజీబ్ను అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించగా.. నర్సాపూర్ మండలం లింగాపూర్లోని తిరుమల అగ్రో ఇండస్ట్రీస్లో భద్రపరిచారు. డీసీఎం వాహనాన్ని తదుపరి ఆదేశాల వరకు కొల్చారం పోలీస్స్టేషన్లో ఉంచినట్లు ఎస్త్స్ర మొహమ్మద్ మోహినుద్దీన్ తెలిపారు.

మరిన్ని వార్తలు