తెలంగాణ రక్షణసేన అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా సోడెం వెంకట్

16-09-2026 | 06:34pm

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ రక్షణసేన(Telangana Rakshana Sena) అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ గా దమ్మపేట మండలం, నల్లకుంట గ్రామానికి చెందిన సదుం నియమితులయ్యారు. టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగిస్తూ ఇన్‌చార్జ్‌ల జాబితాను ప్రకటించారు. ఇందులో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా సోడెం వెంకట్‌ను నియమించారు. ఈ సందర్భంగా సోడెం వెంకట్ మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గం(Ashwaraopet constituency)లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. 

నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలను చేపడతామని, ప్రజా సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల తరఫున నిరంతరం పోరాడేందుకు పార్టీ శ్రేణులను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు.

సోడెం వెంకట్‌ను అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో నియోజకవర్గంలో తెలంగాణ రక్షణసేన మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు