మల్లన్న గండిలో విషాదం
04-10-2026 | 09:57pm
నీట మునిగి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
నర్మెట్ట, అక్టోబర్ 04 (విజయక్రాంతి) : జనగామ జిల్లా(Jangaon District) నర్మెట్ట మండలం గండిరామారం మల్లన్న గండి రిజర్వాయర్(Mallanna Gandi Reservoir) లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి(Software engineer dies) చెందాడు. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన పడాల కళ్యాణ్ కుమార్(Padala Kalyan Kumar) (27) వరంగల్ లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మల్లన్న గండికి వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.