1 September, 2026 | 11:16 PM

Breaking News

'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?   •   రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •  

సోలార్, ఎలక్ట్రికల్ వాహనాలు బెటర్

15-05-2026 | 01:21am

హనుమకొండ, మే 14(విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్,పెట్రోల్ వాడకుండా సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ అనే ఉపయోగించాలని వరంగల్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి పిలుపునిచ్చారు.గురువారం వరంగల్ చౌరస్తాలో  రాజనాల శ్రీ హరి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం శ్రీహరి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద భార తీయులు ఎప్పుడు ఆధారపడవద్దని, ఇతర దేశాల మీద ఆధారపడవద్దని ఏ దేశంలో యుద్ధం జరిగిన ఆ యొక్క ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందని, దాని ద్వారా డీజిల్, పెట్రోల్  విలువ పెరుగుతుందని, గ్యాస్ ప్రజలకు అందుబాటులో లేకపో వడం వల్ల వాటిపై అధికమైన ధరలు పెరిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.

అందువల్ల ప్రతి ఒక్కరు సైకిల్ వినియోగం పెంచి,పెట్రోల్,డీజిల్ ని ఆదా చేయాలన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బ్యాటరీ సోలార్ బండ్లను వినియోగించుకోవాలని అదేవిధంగా ముఖ్యమంత్రు లు, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మిగతా రాజకీయ నాయకులు వారి యొక్క సెక్యూరిటీ వాహనాలను తగ్గించుకోవాలని కోరారు.