calender_icon.png 12 February, 2026 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి

11-02-2026 03:17:05 AM

రాజేంద్ర నగర్ ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : శివరాంపల్లి పీవీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 274 వద్ద నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించా లని ఐక్యత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులకు ఫర్యాదు చేశారు.  ఇక్కడ బస్టా ప్ ఉండటంతో పాటు యూటర్న్ కూడా ఉండటం నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని,

దీని వల్ల తరచూ ప్రమాదాలు కూడ జరుగుతున్నాయని ఇన్‌స్పెక్టర్ సిహెచ్ రాజు కు వివరించారు. అదే విధంగా పిల్లర్ నెంబ ర్ 271 నుంచి 277 వరకు సర్వీస్ రోడ్డులో వ్యాపార సముదాయాలకు వచ్చే వాహనదారులు రోడ్ల పైనే అక్రమంగా వాహనాల ను పార్కింగ్ చేస్తుండటం ట్రాఫిక్ సమస్యతో కాలనీ వాసులకు, ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు.

పుట్‌పాత్ వ్యాపారుల వల్ల చాలా సమస్య ఉత్పన్నమవుతుందని అసోసియేషన్ అధ్యక్షులు పి. వెంకటేష్, ఉపాధ్యక్షులు డి ఆంజనేయులు, కార్యదర్శి ఎస్. శ్రీనివాస్, గణేష్ లు ఇన్స్పెక్టర్‌కు వివరించారు. సమస్యను విన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ మాట్లాడుతూ  ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్న ప్రాంతాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు.