15 March, 2026 | 9:24 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్'తో సైబర్ నేరాల నియంత్రణ

03-12-2025 11:15 PM

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ఎస్పీ రోహిత్ రాజ్....

కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, జిల్లా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 42 రోజులపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు,ఇతర పోలీస్ అధికారుల సమక్షంలో సైబర్ నేరాల నివారణ కొరకు రూపొందించిన "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పోస్టర్లను జిల్లా ఎస్పీ విడుదల చేశారు.

06 వారాల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సైబర్ నేరాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల అధికారులు, సీఐలు, డీఎస్పీలు "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తారని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ అశోక్,సిఐ జితేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ సీహెచ్. శ్రీనివాస్, ఇ.శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ రాము, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఎస్సైలు రాజమౌళి, శ్రీనులు పాల్గొన్నారు.