03-12-2025 11:16:55 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): మండలంలోని సారపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దరావత్ చందు నాయక్ కు సారపాక ఆటో యూనియన్ మద్దతు పలికారు. గ్రామాభివృద్ధి పట్ల చందు నాయక్ చూపుతున్న కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే విధానం పరిపూర్ణ నాయకత్వానికి నిదర్శనమని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, రోడ్ల మరమ్మత్తులు, స్టాండ్ సౌకర్యాలు వంటి అంశాలను చందు నాయక్ ముందుండి పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గ్రామ అభివృద్ధికి అతడి సేవలు కొనసాగాలన్న సంకల్పంతో యూనియన్ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. చందు నాయక్ ఈ మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సారపాకను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.