పుట్టిన గడ్డ తొలిమెట్టు..!
- పాతతరం ఎమ్మెల్యేలంతా సర్పంచ్ లే..
ఉమ్మడి జిల్లాలో ఆ ఐదుగురు నేటి సర్పంచ్లకు ఆదర్శం
మణుగూరు, డిసెంబర్ 3 (విజయక్రాంతి): గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామాలను పాలించే ప్రథమ పౌరుడు నిజాయితీగా పాలించి ప్రజల చేత ప్రశంసలు పొందగలితే వారికి రాజకీయ అవకాశాలు కూడా అలాగే వెతుక్కుంటూ వస్తాయి. ప్రతి రాజకీయ నాయకుడి ఎదుగుదలకు జన్మనిచ్చిన గడ్డ తొలిమెట్టు. స్వగ్రామంలో ప్రజల చేత అభిమానం పొందిన వారు కచ్చితంగా రాజకీయ రంగంలో రాణిస్తారని ఆ నాయకులు నిరూపించారు.
సర్పంచ్ నుండి రాజ కీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి ఉమ్మడి ఖ మ్మం జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటి అభివృద్ధికి బాటలు వేశారు. ఆ ఐదుగురు నేటి సర్పంచ్ లకు ఆదర్శంగా నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు వెళ్లిన ఆ నాయకుల రాజకీయ ప్రస్థానంపై విజయక్రాంతి అందిస్తున్న కథనం..
సర్పంచ్ నుండి అమాత్య వరకు...
కమ్యూనిస్టుల కంచుకోటపై అలుపెరగని పోరాటం చేసిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం సర్పంచి పదవితోనే ప్రారంభమైంది. మూ డుసార్లు కామేపల్లి మండలం పాత లింగాల పంచాయతీ నుండి ఏకగ్రీవంగా స ర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన సుజాతనగర్ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు, పా లేరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్, కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.ఖమ్మం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగిన ఆయన 2018 లో ఆకస్మికంగా ఆనారోగ్యంతో మృతి చెందారు.
సర్పంచ్ నుండి శాసనసభ్యుడిగా.. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య
రాజకీయ ప్రస్థానం సర్పంచి పదవి నుంచే మొదలయ్యింది. ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీ నుంచి సర్పంచిగా 1981లో ఎన్నికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన ఊకె అబ్బయ్య సింగరేణి కార్మికు నిగా పనిచేశారు.1983 లో సిపిఐ పార్టీ నుండి బూర్గంపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో సీపీఐ నుంచి మిత్ర పక్షాల అభ్య ర్ధిగా పోటీచేసి రెండోసారి అక్కడే గెలిచారు. తిరిగి 2009లో టిడిపి నుండి మిత్రపక్షల అభ్యర్థిగా విజయం సా ధించాడు. ఇలా మూడుసార్లు ఎమ్మె ల్యేగా విజయం సాధించేందుకు సర్పంచి గా ఆయన చేసిన సేవలే కారణం అయ్యాయి.
ఆదర్శ ఎమ్మెల్యేగా... గుమ్మడి
ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా న్యూ డెమొక్రసీ పార్టీ తరఫున పోటీ చేసి ఐదు సార్లు ఘన విజయం సాధించిన గుమ్మ డి నర్సయ్య రాజకీయ ప్రస్థానం కూడా సర్పంచ్ గానే మొదలైంది.1981లో ఇల్లెందు తాలుకా పరిధిలోని ఉసిరికాయలపల్లి సర్పంచ్ గా ఆయన గెలిచారు. రెండేండ్ల పదవీకాలం కాగానే ఎమ్మెల్యే ఎన్నికలు రావడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఆదర్శ ఎమ్మెల్యేగా గుర్తింపు పొం దారు.
సర్పంచ్.. హెల్త్ మినిస్టర్...
వైఎస్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య మంత్రిగా పని చేసిన వనమా వెంకటేశ్వర రావు మొదటిసారి 1971లో పాల్వంచ సర్పంచ్ గా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంతరం పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మెన్ గా తర్వాత కొత్తగూడెం నియోజక వ ర్గం ఎమ్మెల్యేగా 4 సార్లు ఎన్నికయ్యారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డీ క్యాబినెట్లో వైద్య విధానాశాఖ మంత్రి గా పనిచేశారు.
సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా...
సిపిఎం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహ రించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 1988లో ఆ పార్టీ నుండి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బలమైన ప్రజా ఉద్యమాలతో ప్రజల మన్నన లను పొందిన ఆయన తొలిసారి గా 1999లో సిపిఎం నుండి భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2009 లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏజెన్సీ ప్రాం త వాసుల సమస్యలపై అసెంబ్లీలో గళ మెత్తారు. ఇలా గ్రామం నుండి శాసన సభ, మంత్రి వరకు ఎదిగిన ఈ నాయకులు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.




