25 August, 2026 | 5:25 PM

Breaking News

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసిన యాదవ ఉత్సవ కమిటీ   •   ముసాపేటలో బీపీ మండల్ జయంతి వేడుకలు   •   వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు   •   బిజెపిరాష్ట్ర అధ్యక్షుడి ధర్నాకు కామారెడ్డి బిజెపి నాయకులు మద్దతు   •   గూడెం పాఠశాలలో వన మహోత్సవం   •   104వ రైతునేస్తం కార్యక్రమం   •   రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అమ్జాద్ పాషా నియామకం   •   కంటి దానం మరొకరి జీవితంలో వెలుగులు   •   విద్యాసంస్థలు, దేవాలయాల సమీపంలోని బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలి   •   నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ జోయెల్ డోనాల్డ్   •  

సురంగల్‌లో ప్రత్యేక ఆధార్ డ్రైవ్

23-05-2026 12:00 AM

మొయినాబాద్, మే 22 (విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు సురంగల్ గ్రామంలో శుక్రవారం కౌన్సిలర్ కర్రోళ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఆధార్ సేవలను సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.గ్రామాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఆధార్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన కౌన్సిలర్ కర్రోళ్ల శ్రీధర్, ఆధార్ సెంటర్ నిర్వాహకులతో చర్చించి గ్రామంలోనే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ డ్రైవ్లో ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉన్న ఆధార్ కార్డులను తెలంగాణ అడ్రస్కు మార్చడం, ఇంటి నంబర్లు, వీధి పేర్లలో ఉన్న తప్పులను సరిచేయడం వంటి సేవలను అందించారు. అదేవిధంగా చిన్నారులకు కొత్త ఆధార్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు.  గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సేవలను వినియోగించుకున్నారు. గ్రామస్థులు స్పందిస్తూ గ్రామంలోనే ఆధార్ సేవలు అందించడం ఎంతో ఉపయోగకరమని కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు.