25 August, 2026 | 6:20 PM

వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు

25-08-2026 05:17 PM

దోమకొండ,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా దోమకొండ గ్రామ రైతువేదికలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, ఎంపీడీవో మధురిమ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మొక్కలను నాటి వదిలేయకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని తెలిపారు. రైతువేదిక పరిసరాల్లో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

దోమకొండ సొసైటీలోనూ వన మహోత్సవం

దోమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి ఎ సి ఎస్) ఆవరణలోనూ మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి (డీసీఓ) రామ్మోహన్ హాజరై మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మణిదీపిక, నీటిపారుదల శాఖ ఏఈ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఐకేపీ ఏపీఎం, టీఏ, ఎఫ్‌ ఏ, వీ ఓ సభ్యులు, సి ఎ లు, ప్రజాప్రతినిధులు, వేజ్ సీకర్స్ తదితరులు పాల్గొన్నారు.