25 August, 2026 | 5:54 PM

Breaking News

ముసాపేటలో బీపీ మండల్ జయంతి వేడుకలు

25-08-2026 05:20 PM

​మూసాపేట: భారతీయ రాజకీయాల్లో బహుజనుల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి విశేష సేవలందించిన ప్రముఖ సంఘ సంస్కర్త, మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీ.పీ. మండల్) జయంతి వేడుకలను మంగళవారం ముసాపేట మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీపీ మండల్ చిత్రపటానికి గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉందేకోడ్ తిరుపతయ్య మాట్లాడుతూ.దేశంలో వెనుకబడిన తరగతుల ఓ బి సి అభివృద్ధికి, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు సాధించడంలో బీపీ మండల్ గారు చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.