అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి ఏప్రిల్ 19(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో కొండపోచమ్మ ఆలయముకు నిర్మాణం చేసిన సిసి రహదారిని, సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను ఆయన ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోరెం కొండ పోచమ్మ ఆలయం కు సిసి రహదారి నిర్మాణం చేసి, సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. పలుకుల సంఘాలు బాధితులు ఇచ్చిన విజ్ఞప్తులను ఆయన తీసుకొని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, కోరెం సర్పంచ్ జంపుక మాధవి ఆనంద్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఎంపీడీవో భీమా జయ శీల, సెస్ ఏ ఈ ప్రశాంత్,ఏఎంసీ చైర్మన్ బోయిని ఏల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నిమ్మ వినోద్ రెడ్డి, సర్పంచులు మోహన్, ఏనుగుల కనకయ్య, జంగం అంజయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు మహేశ్వర్ రెడ్డి రవీందర్, లక్ష్మీరాజం, శ్రీనివాస్, అంజయ్య, హనుమాన్లు, చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ లు పాల్గొన్నారు.






