18 August, 2026 | 11:13 AM

నాగిరెడ్డిపేట ప్రజావాణిలో దరఖాస్తులు

18-08-2026 10:31 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం మొదటిసారిగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై 09 దరఖాస్తులు వచ్చినట్లు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. ఇట్టి దరఖాస్తులను ఆన్ లైన్లో నమోదు చేసి దరఖాస్తుదారులకు రసీదు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారుల సమక్షంలో ఫిర్యాదులు స్వీకరించి సమస్య పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు సేవ అందించాలని సదుద్దేశంతో జిల్లా కేంద్రాల్లో మాదిరిగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మొదటిసారిగా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుండి స్వీకరించిన వినతులను మండల స్థాయిలో పరిష్కారమయ్యే వాటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీడీవో గంగాధర్ తెలిపారు.

మండల స్థాయిలో పరిష్కారం కానీ వినతులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో గంగాధర్, ఎమ్మార్వో బిక్షపతి, సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్,ఎంపిఓ ప్రభాకర్ చారి, ఏపీవో సక్కుబాయి ఏపిఎం దత్తు, పంచాయత్ రాజ్ ఏఈ పిచ్చయ్య ఏమో సాయికిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.