నిలువ చేసిన రేషన్ బియ్యం పట్టివేత యజమానిపై కేసు నమోదు
పిడిఎస్ నిలువ చేసే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి
రేషన్ బియ్యం వ్యాపారులకు సహకరిస్తే చర్యలు తప్పవు
పౌర సరఫరా శాఖ అధికారి వీరేశం
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కమ్మరి రవీందర్ చారి
గుమ్మడిదల: పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్నబియ్యాన్ని ఇస్తున్న తరుణంలో గుమ్మడిదల గ్రామానికి చెందిన దళారులు పిడిఎస్ బియ్యాన్ని అరకొర ధరలకు తీసుకొచ్చి వాటిని తిరిగి సుమారు 40 నుండి 50 రూపాయల ధరలకు అక్రమంగా తరలించి క్రయవిక్రయాలు జరుపుతున్న వ్యక్తి పై పౌర సరఫరా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇట్టి తనిఖీలలో నవీన్ కుమార్ అనే రేషన్ బియ్యం వ్యాపారి తను నిర్వహిస్తున్న కిరాణా షాపుకు ఎదురుగా ఉన్నటువంటి షెటర్లో రేషన్ బియ్యం ఉన్నట్లు రెవెన్యూ అధికారులకు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తనిఖీలు నిర్వహించగా సుమారు 12 సంచుల పైచిలుకు ఆరు క్వింటాళ్లు బియ్యాన్ని సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారి వీరేశం తెలిపారు.
సుమారు గత మూడు నెలల నుండి ప్రస్తుత వ్యాపారి రేషన్ బియ్యాన్ని వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినప్పటికీ సరైన సమాచారం మేరకె సోమవారం తనిఖీలు నిర్వహించమన్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కమ్మరి రవీందర్ చారి మాట్లాడుతూ... మండలంలో రేషన్ బియ్యాన్ని వ్యాపారం చేసే వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అక్రమ వ్యాపారానికి సహకరిస్తే ఎంతటి వారైనా వారికి కూడా తగిన గుణపాఠం చెప్పాలని, రేషన్ బియ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సన్నబియ్యాన్ని సామాన్య ప్రజలు పరమాన్నాలుగా తినడానికే ఇస్తున్నారని వాటిని అక్రమ రవాణాకు తరలిస్తే చట్టపరమైన కేసులు తప్పక చేయాలని,అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న వ్యాపారస్తులపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉక్కు పాదాన్ని మోపాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారూ. వీరితోపాటు ఆర్ ఐ పవన్ కుమార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.






