calender_icon.png 8 August, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి

09-08-2025 12:00:00 AM

  1. తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీజీఆర్టీసీ 

టూరిజం ప్యాకేజీలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

భద్రత ప్రయాణం.. బహుళ సదుపాయాలు

నిర్మల్, ఆగస్టు ౭(విజయక్రాంతి): ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పది చెప్పుకుంటున్న పీజీ ఆర్టీసీ ఇప్పుడు ఆదాయ వనరులపై మరింత దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక ఆదాయం పొందుతున్న నిర్మల్ డిపో అధికారులు వినూత్న రీతిలో ప్రతి నెలలో తీర్థయాత్రలు టూరిజం ప్యాకేజీలు పెండ్లి పెళ్లి బుకింగ్ వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్యాకేజీలను ప్రకటిస్తూ వాటిని ప్రయాణికులు ఉపయోగించుకునే వేళ ప్రజల్ని చైతన్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

గత మూడు నెలల నుంచి ఒకవైపు మహాలక్ష్మి ఉచిత పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగి ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా అదనపు ఆదాయ వనరుల కోసం ఈ వినూత్న పథకాలను పీజీఆర్టిసి ఉన్నత అధికారుల ఆదేశం మేరకు నిర్మల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు .

నిర్మల్ జిల్లాలో  నిర్మల్ బైంసా టీజీ ఆర్టీసీ డిపోలు ఉండగా నిర్మల్ డిపోలో 144 బైంసా డిపోలో 72 ఆర్టీసీ సర్వీసులను ప్రజా రవాణా కోసం ఉపయోగిస్తూనే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీర్థయాత్రలు టూరిజం ప్యాకేజీలు పెండ్లి టూర్లు విద్యార్థులకు ఎక్స్కర్షన్ వంటి పథకాలతో మరింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తున్నారు

ఆదాయంపై దృష్టి

నిర్మల్ జిల్లాలో టీజీ ఆర్టీసీ ద్వారా ఆదా య వనరులను మరింత పెంపొందించేందుకు టూరిజం ప్యాకేజీని అమలు చేస్తు న్నారు. నిర్మల్ బైంసా డిపో మేనేజర్లు పండ రి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏ గ్రామం నుండి అయినా తీర్థయాత్రలకు గాని టూరిజం ప్రదేశాలకు గాని పెండ్లి నిర్ణయించుకున్న కుటుంబాల్లో కానీ ఇతర అవసరాలకు గాని ప్రైవేటు వాహనాలు ఆశ్రయించకుండా టీజీ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

టూరిజం ప్రదేశాలను టీజీ ఆర్టీసీ ముం దుగానే గుర్తించి అక్కడికి భక్తులు వెళ్లేందుకు టూరిజం ప్యాకేజీని అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నాసిక్ పంచవటి భద్ర హనుమాన్ భద్రకాళేశ్వరాలయం తెలంగాణలోని కాలేశ్వ రం భద్రాచలం యాదాద్రి నరసింహస్వామి కొండగట్టు అంజన్న వరంగల్ భద్రకాళి ఆలయం వేములవాడ రాజేశ్వరి స్వామి హైదరాబాదులోని వివిధ టూరిజం ప్యాకేజీలను అమలు చేసి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

దూరాన్ని బట్టి తక్కువ చార్జీలకి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో భద్రతమైందని సురక్షితమైందని భరోసా కల్పిస్తూ టూరిజం వెళ్లే సమయంలో భోజనం టిఫిన్లు చూసే ప్రదేశాలు టూరిజం గైడ్ అక్కడి ప్రత్యేకతలను భక్తులకు వివరించే విధంగా టీజీ ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టడంతో నిర్మల్ జిల్లాలో టూరిజం ప్యాకేజీలకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐ సామాజిక వ్యక్తులను దాతలను సంప్రదించి పలుకుబడి ఉన్న వారి సంప్రదించి టూరిజం ప్యాకేజీలు అమలు చేస్తూ ప్రయాణికులకు భక్తులకు మరింత చేరువ అవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని కుంటాల లోకేశ్వరం ముధోల్ బాసర్ నర్సాపూర్ సారంగాపూర్ కడెం పెద్దూర్ తదితర ప్రాం తాల నుంచి వేలాది భక్తులను టూరిస్టులను విద్యార్థులను వివిధ ప్రాంతాల సందర్శనకు క్షేమంగా తీసుకెళ్లి సురక్షితంగా తిరిగి ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో హెడ్మాస్టర్లను సంపాదించి టూరిజం ప్యాకేజీ విరాళాలను వివరిస్తూ విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలన్న టీజీ ఆర్టీసీ బస్సులను ఆ పాఠశాలకు పంపి ఆదాయం పెంచుకుంటున్నారు గ్రామంలో పెళ్లిళ్లు నిర్వహించుకునే కుటుంబాలను ముందుగానే సంప్రదిం చి టీజీ ఆర్టీసీ ప్యాకేజీ బుక్ చేయించుకుంటున్నారు. ఇందులో ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆర్టీసీ సిబ్బంది కోరుకుంటే వారిని వారికి అనుకూలంగా పంపిస్తున్నారు ప్యాకేజీ భక్తుల సంద ర్శన వివరాలను ఎప్పటికప్పుడు టీజీ ఆర్టీసీ యాప్ సోషల్ మీడియాలో పెట్టి ప్రోత్సా హం అందిస్తున్నారు

సురక్షిత ప్రయాణం 

టీజీ ఆర్టీసీ ద్వారా టూరిజం ప్యాకేజీలను అమలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే భక్తులకు టూరిస్టుల బస్సులకు అనుభవం ఉన్న డ్రైవర్లకు ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే పంపుతున్నారు ఆ ప్రాంతంపై పూర్తిగా తెలిసిన వారిని అక్కడ విశేషాలను చెప్పగలిగే వారిని ఎంపిక చేసి భక్తులకు ప్రయోజనం చేకూర్చులా చర్యలు తీసుకుంటున్నారు.

సూపర్ లగ్జరీ డీలక్స్ సెమి డీలక్స్ ప్రజల డిమాండ్ ను బట్టి అట్టి సర్వీసులను ఏర్పాటు చేసి బస్సు ప్రయా ణం జియో ట్రాకింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు క్షేమము సమాచారాన్ని ఆర్టీసీ అధికారులు డిపో నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టీజీ ఆర్టీసీ ద్వారా ప్రజలకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విద్యార్థులకు ఉచిత పాసులు రాయితీ పాసులు దివ్యాంగులకు అందిస్తున్న పాసులు వివరిస్తూ ప్రజలు కూడా ఆర్టీసీని ఆదరించి నప్పుడే మీ గ్రామానికి అవసరం మేరకు ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తామని భరో సా కల్పిస్తూ టూరిజం ప్యాకేజీలను అమలు చేస్తూ ఆదాయ బంధువులను పెంపొందించుకుంటున్నారు.

దీంతో నిర్మల్ జిల్లాలో టీజీ ఆర్టీసీ టూరిజం ప్యాకేజీలకు డిమాండ్ ఏర్పడడంతో పార్టీ అధికారం అందుకు అనుగుణంగా వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చి విజ్ఞప్తిన రీతిలో చర్యలు చేపట్టడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

టీజీ ఆర్టీసీ ప్రయాణికుల సేవ కర్తవ్యంగా భావిస్తూ ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా వివిధ టూరిజం ప్యాకేజీలను అమలు చేయడం జరుగుతుందని నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఇప్పటికే నిర్మల్ డిపో ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోని వివిధ టూరిజం ప్రదేశాలు దేవాలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు టూరిస్టులకు ప్రయాణ భద్రత కల్పించామని తెలిపారు. ఎక్కడికి భక్తు లు వెళ్లాలన్న టీజీ ఆర్టీసీని సంప్రదిస్తే వారి వద్దకు ఆర్టీసీ బస్సులను పంపుతామని  తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

 పండరీ, నిర్మల్ డీఎం 

మంచి అవకాశంగా భావిస్తున్నాం

టీజీ ఆర్టీసీ ద్వారా వివిధ దేవాలయాలకు చారిత్రాత్మక ప్రదేశాలకు టూరిజం ప్యాకేజీలను టీజీ ఆర్టీసీ అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్యాకేజీలు అమలు చేయడం వల్ల ఆధ్యాత్మిక పెరిగి సమాజంలో చెడు దూర మయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం వల్ల ఆర్థిక భారం ఇతర సమస్యలు  ఏర్పడి భక్తులు ఇబ్బం ది పడే అవకాశం ఉంది టిజిఆర్టిసి ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

 రాజు, పూజారి సూర్యాపూర్