13 July, 2026 | 8:12 PM

Breaking News

టీ-ఫైబర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

13-07-2026 07:33 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో టీ-ఫైబర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ రాజస్వ మండల అధికారులు లోకేశ్వర్ రావు, చెన్నూరి కిషయ్యలతో కలిసి జిల్లాలో టీ-ఫైబర్ అభివృద్ధిపై రెవెన్యూ, అటవీ, టెలికాం సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఇంటర్నెట్ సేవలు మరింత సౌకర్యవంతంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు జిల్లాలో టి ఫైబర్ సేవలు సమగ్రంగా అందించేందుకు గాను విస్తరణ సంబంధిత అనుమతుల కొరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఫైబర్ అదనపు సంచాలకులు శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సురేష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శశిధర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.