4 July, 2026 | 6:54 PM

18న ప్రత్యేక లోక్ అదాలత్

04-07-2026 05:47 PM

సిద్దిపేట క్రైం: చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ఈ నెల 18న స్పెషల్ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామని న్యాయసేవాధికారసంస్థ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా న్యాయసేవాధికారసంస్థ అధ్వర్యంలో నిర్వహించే ఈ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని శనివారం న్యాయవాదులతో జిల్లా కోర్టు భవనంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ... సిద్దిపేట జిల్లాలో మొత్తం 1324 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. స్పెషల్ లోక్ అదాలత్ లో పెద్ద సంఖ్యలో కేసులు రాజీపడేటట్లు చూడాలని న్యాయవాదులకు సూచించారు. ఈ సమావేశంలో  అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.కుమార స్వామి,  ఒకటో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, న్యాయవాదులు, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు.