4 July, 2026 | 6:54 PM

బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా రాజేశ్వర్

04-07-2026 05:45 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన తోటపల్లి రాజేశ్వర్  తెలంగాణ ఉద్యమకారుల వేదిక నియోజక వర్గ కళాకారుల విభాగం ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంస్థ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేష్ నియామకం ఉత్తర్వులు జారీ చేశారు. రాజేశ్వర్ తెలంగాణ ఉద్యమకారుల వేదిక  (టీయూవీ)కు మలి దశలో ఉద్యమంలో కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు.

కళాకారుడిగా ఆయన ఉద్యమానికి పాటలతో విస్తృత మద్దతు కూడగట్టారున్నారు. అందుకుగాను తోటపల్లి రాజేశ్వర్ బెల్లంపల్లి నియోజకవర్గ కళాకారుల విభాగం ఇంచార్జ్ గా  నియమించినట్లు పేర్కొన్నారు. తోటపల్లి రాజేశ్వర్ నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకారుడన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజమైన ఉద్యమకారులకు అమలు చేసేంత వరకు పోరాడాలనీ పిలుపు నిచ్చారు.