వర్షాలు సమృద్ధిగా కురవాలి.. పంటలు బాగా పండాలి
01-08-2026 08:27 PM
* భద్రాచలంలో జక్కు సోదరుల ప్రత్యేక పూజలు
ఆమనగల్లు,(విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అమనగల్ మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీ జక్కు అనంతరెడ్డి భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని తన సోదరుడు శ్రీ జక్కు విజయరెడ్డి మరియు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన, ఆలయంలో ప్రత్యేక అర్చనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేదాశీర్వచనం తో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా జక్కు అనంతరెడ్డి ఆకాంక్షించారు.






