1 August, 2026 | 9:42 PM

విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి

01-08-2026 08:45 PM

- క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై భగ్గుమన్న విద్యార్థులు 

- దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు.‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి"క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతోపాటు  నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.