1 August, 2026 | 9:18 PM

పేద ప్రజల భూములను కాపాడాలి

01-08-2026 08:42 PM

- హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

- ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి పత్రం అందజేత

ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల పరిధిలోని హన్మగల్ – హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 255/1 భూముల సమస్యలను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, భూ బాధితులు కోరారు. ఈ మేరకు శనివారం ఎంపీ ఈటల రాజేందర్ ని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ...  సర్వే నెం. 255/1లో మొత్తం 74 ఎకరాల 37 గుంటల భూమి ఉండగా, అందులో సుమారు 18 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం నెలకొన్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చిందని, అనంతరం కొందరు రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇతరులకు విక్రయించారని వివరించారు. ప్రస్తుతం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఎంపీ ఈటల రాజేందర్ వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని, బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ...  పేద ప్రజల హక్కులకు భంగం కలిగితే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. పేదల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.