calender_icon.png 12 October, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు యాదవ సంఘం నాయకుల ప్రత్యేక కృతజ్ఞతలు

11-10-2025 10:55:30 PM

మంథనిలో రాధాకృష్ణ యాదవ సంఘం, గొల్లగూడెం బోయిన్ పేటలో శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం..

మంథని (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం(బోయిన్ పేట)లోని రాధాకృష్ణ యాదవ సంఘం భవనం కోసం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ. 40 లక్షలు మంజూరు చేయించారు. శనివారం గొల్లగూడెంలో శ్రీధర్ బాబు చిత్రపటానికి యాదవ సంఘం నాయకులు పాలాభిషేకం చేసి, కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాధాకృష్ణ యాదవ సంఘం, గొల్లగూడెం అధ్యక్షులు పర్షవేన గణేష్ యాదవ్, మంథని మండల యాదవ సంఘం అధ్యక్షులు పర్షవేణ మోహన్ యాదవ్ లు మాట్లాడుతూ గొల్లగూడెం(బోయిన్ పేట) శ్రీ రాధాకృష్ణ యాదవ సంఘం భవనం నిర్మించుకొని, కమ్యూనిటీ హాల్ గా, అన్ని రకాలుగా మా యాదవ సంఘంకు ఉపయోగపడేటట్టుగా చేసుకుంటామని తెలియజేశారు.

యాదవ కులస్తులు దుద్దిళ్ల కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేశారు. గొల్లగూడెం యాదవ సంఘం భవనానికి నిధులు కేటాయించిన మంత్రి శ్రీధర్ బాబుకు సహకరించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంథని టౌన్ అధ్యక్షులు పోలు శివ, పర్షవేణ(ఆర్కె) రాజు యాదవ్, మిరియాల శ్రీనివాస్ యాదవ్, పేరవేన కొమురయ్య యాదవ్, పర్షవేన సతీష్ యాదవ్, గడ్డి కుమార్ యాదవ్, పర్షవేన సంతోష్ యాదవ్, పర్షవేన శంకర్ యాదవ్, ఉడుత రవి యాదవ్, నాగనవేన సతీష్ యాదవ్, తాత అంకుష్ యాదవ్, ముచ్చర్ల రవి యాదవ్, ఎర్రవీణ వినయ్ యాదవ్, మిరియాల శ్రావణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, యాదవ సంఘం నాయకులు కుల సభ్యులు పాల్గొన్నారు.