calender_icon.png 12 October, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం.!

11-10-2025 10:49:38 PM

పెట్టుబడులంటూ 12. 30 లక్షలు స్వాహా..

నిండా మోసపోయిన రైల్వే ఉద్యోగి..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఆన్లైన్ ట్రేడింగ్ పెట్టుబడులంటూ సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. విడతల వారిగా 12.30 లక్షలు ఓ రైల్వే ఉద్యోగి నుండి స్వాహా చేశారు. తీరా మోస పోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో నివాసం ఉంటున్న శెట్టిపల్లి తిరుపతయ్య అనే రైల్వే ఉద్యోగి తన వాట్సాప్ కి షేర్ మార్కెట్ పెట్టుబడులంటూ మెసేజ్ రావడంతో పెట్టుబడులు స్టార్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 13 నుండి విడతలవారీగా సుమారు 12.30 లక్షలు పెట్టుబడులు పెట్టినప్పటికీ ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో ఆన్లైన్ కాల్ సెంటర్ 1930 కాల్ చేసి ఆరా తీశాడు. అది సైబర్ మోసం పనే నని తేలిపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.