ఈనెల 16 నుంచి భారత జనాభా గణన
నిర్మల్,(విజయక్రాంతి): భారత జనాభా గణన–2025 నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని జనాభా గణన సంచాలకుల కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లాలో కీలక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని తహసిల్దారులు,
మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 16 నుండి 18 తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించబడుతుందని తెలిపారు. జనాభా గణనకు సంబంధించిన విధానాలు, సమాచార సేకరణ, పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
ఈ శిక్షణా తరగతులలో సంబంధిత అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉన్నందున సోమవారం అనగా మార్చి 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.




