14 March, 2026 | 5:42 PM

ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

14-03-2026 04:27 PM

మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, మనోజ్ రావు 

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రెంటాల సుహాసిని, మనోజ్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులకి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందించి మందులు పంపిణీ చేయాలని, వైద్యం కోసం వచ్చిన వారిని ఆరోగ్య సమస్యలు తెలుసుకొని జబ్బులు న్యాయమేల వైద్యులు చూడాలని సూచించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

13, 14, 28 వార్డులలో డ్రైనేజీలను,రహదారులను పరిశీలించి డ్రైనేజీలలో ఎప్పటికప్పుడు చెత్తను తీసివేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సందమల్ల పుణ్య &బాబు, తాళ్లపల్లి రమేష్ గౌడ్, వజ్పల్లి వెంకటేశ్వర్లు, మేనేజర్ భూపాల్ రెడ్డి,సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, సానిటరీ జవాన్ ఆరేలి రమేష్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.