దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా స్ఫూర్తి ఫౌండేషన్

17-09-2026 | 11:43am

కల్లూరు, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్, బత్తులపల్లిలో స్ఫూర్తి ఫౌండేషన్(Spoorthi Foundation)ఆధ్వర్యంలో బుధవారం ఒంటరి దివ్యాంగురాలు, ఒంటరి మహిళకు చిరు వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండ్లను అందజేశారు. శాంతినగర్‌(Shantinagar)కు చెందిన ఖమ్మంపాటి నాగేశ్వరి దివ్యాంగురాలు కాగా, పెన్షన్‌పైనే జీవనం సాగిస్తున్నారు. ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు చిరు వ్యాపారం చేసుకునేలా తోపుడు బండిని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరి శ్రీవ్యాల్ అందజేశారు.

అదేవిధంగా బత్తులపల్లికి చెందిన పోతిని సుశీలకు కూడా తోపుడు బండిని అందించారు.అనంతరం ఎకం ఫౌండేషన్ సహకారంతో గత నెలలో అందించిన 50 డ్యూయల్ డెస్క్ బెంచీలను పరిశీలించేందుకు పలు పాఠశాలలను సందర్శించారు. వాచ్చనాయక్ తండా, జిడిపల్లి, కలాలివాడ, జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాల, బత్తులపల్లి ఎంపీపీఎస్ పాఠశాలల్లో బెంచీలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

పాఠశాలల్లోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేశారు.కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉయ్యూరి శ్రీవ్యాల్, ఉయ్యూరి శత్రుజ్ఞుడు, రామలక్ష్మి, కల్లూరు స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు