9 April, 2026 | 8:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రూ.3,000 కోట్ల సమీకరణకు స్పైస్‌జెట్ షేర్‌హోల్డర్లు ఆమోదం

14-09-2024 02:56 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సెక్యూరిటీల జారీద్వారా రూ. 3,000 కోట్ల నిధుల్ని సమీకరించాలన్న ప్రతిపాదనకు స్పైస్‌జెట్ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. పలు న్యాయపోరాటాలు, ఆర్థిక సవాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విమానయాన సంస్థ వివిధ అవసరాల్ని తీర్చేందుకు నిధులు సమీకరించాలని ప్రతిపాదించింది.

ఇందుకోసం రూ. 3,000 కోట్ల సేకరణకు ప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానాన్ని తమ షేర్‌హోల్డర్లు ఆమోదించారని స్పైస్ జెట్ తెలిపింది. క్విప్ ఇష్యూ జారీ, ఇతర మార్గాల ద్వారా నిధుల్ని సమీకరిస్తుంది. 2019లో 74 విమానాలు కలిగిన స్పైస్ జెట్ ప్రస్తుతం 20 ఎయిర్‌క్రాఫ్ట్‌లను మాత్రమే నడుపుతున్నది. నిధు ల సమీకరణ వార్త నేపథ్యంలో శుక్రవారం స్పైస్‌జెట్ షేరు 8 శాతం పెరిగి రూ. 71.55 వద్ద ముగిసింది.