9 April, 2026 | 6:50 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఎన్‌ఎస్‌ఈ, చిత్రా రామకృష్ణలపై కేసు కొట్టివేత

14-09-2024 02:55 AM

సెబీ తాజా ఉత్తర్వులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), ఈ ఎక్సేంజ్ మాజీ ఛీఫ్ చిత్రా రామకృష్ణ, రవినారాయణ్, ఇతర ఎక్సేంజ్ మాజీ ఉద్యోగులపై నియంత్రణా ఉల్లంఘన కేసును మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొట్టివేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్సేంజ్ కో లొకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారంటూ 2019లో వీరిపై సెబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించనందున, కేసును ఉపసంహరించు కుంటున్నట్టు సెబీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

డార్క్ ఫైబర్ మార్గంలో కొన్ని బ్రోకరేజ్ సంస్థలకు ముందుగా మార్కెట్ యాక్సెస్‌ను కల్పించారన్నది వారిపై ప్రధాన ఆరోపణ. మార్కెట్ ట్రేడింగ్ మొదలైన సమయంలో తొలుత ఈ బ్రోకరేజ్ ఆర్డర్లే ఎన్‌ఎస్‌ఈ సర్వర్‌లోకి వెళ్లేలా  ఈ డార్క్ ఫైబర్ నెట్‌వర్క్ ఎన్‌ఎస్‌ఈ అధికారులు ఉపయోగించారని అప్పట్లో సెబీ ఆరోపించింది. ఎన్‌ఎస్‌ఈతో పాటు ఈ ఎక్సేంజ్ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, సీఈవో రవి నారాయణ్‌లతో పాటు ఎన్‌ఎస్‌ఇ ఇతర మాజీ అధికారులు ఆనంద్ సుబ్రమణియన్, అరవింద్ ఆప్టే, ఉమేశ్ జైన్, మహేశ్ పార్కర్, దేవీ ప్రసాద్ సింగ్‌లపై సెబీ ఆరోపణల్ని తాజాగా ఉపసంహరించుకుంది.