17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

స్పిరిట్ షూటింగ్ అక్కడే

31-03-2025 12:11 AM

ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ చిత్రంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల కోసం ఆయన పనిచేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివరలో ‘స్పిరిట్’ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమాను టీ సిరీస్ నిర్మిస్తోంది.

సందీప్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇటీవల సందీప్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో స్పిరిట్ గురించి అడగ్గా.. “నేను లొకేషన్స్ చూసేందుకు మెక్సికోకు వచ్చాను. ‘స్పిరిట్’ సినిమా మెక్సికోలో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి స్పిరిట్ అప్డేట్ ఇదే” అని తెలిపారు.