8 May, 2026 | 1:01 PM

ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత

08-05-2026 12:14 PM

జూపల్లి సందీప్ రావును అభినందించిన దాసరి మనోహర్ రెడ్డి ....

సుల్తానాబాద్, (విజయకాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 11 రోజులపాటు  నిర్వహించిన సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం రాత్రి ముగిసింది, ఈ టోర్నమెంట్ లో  రాహిల్  కింగ్స్ 11 జట్టు విజేతగా నిలిచింది, అల్లాడి అరవిందరావు స్మారకార్థం నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొన్నాయి, ఫైనల్ మ్యాచ్ లో రాహుల్ కింగ్స్ 11 జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా  టోర్నమెంట్ విజేత జట్టుకు మొదటి బహుమతిగా ట్రోఫీతో పాటు లక్ష రూపాయలు  అందజేయడం జరిగింది, రన్నర్ ఆఫ్ జట్టు యంగ్ స్టార్ క్రికెట్ క్లబ్ కు 50 వేల నగదు తో పాటు ట్రోఫీ అందజేశారు, ఈ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన స్పాన్సర్ గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు ను దాసరి మనోహర్ రెడ్డి అభినందించారు, ఈ కార్యక్రమంలో సర్పంచులు సంపత్ , సతీష్ , భూమేష్ , కుమార్, ఉత్తమ కుమారి , నాయకులు అల్లాడి వెంగళరావు, గుణపతి, రాజమల్లు, మనోజ్ గౌడ్ , సూర శ్యామ్ , శ్రీనివాస్ రెడ్డి,  కిషోర్ , చంద్రమౌళి, శంకర్ , సందీప్ , మధు, ఏక్బాల్ తోపాటు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు,