రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు
వ్యక్తిగత దాడులు సరికాదు
చందుర్తి,మే 08,(విజయక్రాంతి): కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో బీజేపీ పార్టీ నాయకుల దాడికి నిరసనగా చందుర్తి మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైటయించి రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే మంత్రి గంగుల కమలాకర్ ఆఫీస్ పై బీజేపీ ఎంపీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరులు చేసిన దాడిని టిఆర్ఎస్ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఏకకాలంలో రెండు క్యాంపు కార్యాలయాలపై దాడి సరికాదని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికి ఉంటుందని ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత దాడులు చేయడమేంటని ప్రశ్నించారు . ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కేడీసీసీ డైరెక్టర్ శ్రీనివాస్ జలగం కిషన్ రావు . నాయకులు చిలుక పెంటయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరాటి మల్లిక్. సర్పంచులు కొక్కుల నరేష్.పోతరాజు నగేష్, సమీర్,మండల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






