12వ బెటాలియన్‌లో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
30-06-2026 01:58 AM
నల్లగొండ టౌన్, జూన్ 29: అన్నేపర్తి 12వ బెటాలియన్ లో సోమవారం ఇంటర్ కంపెనీ గేమ్స్, స్పోరట్స్ మీట్-2026ను బేటాలియన్ కమాండెంట్ కె. వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, సిబ్బంది చురుకుగా పాల్గొని ప్రతిభ చాటాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ యల్. నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్శింగ్ వెంకన్న, కె. మహేందర్, ఏవో దయాకర్, డాక్టర్ నితిన్ గౌతమ్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్త్స్రలు, సిబ్బంది పాల్గొన్నారు.






