30 June, 2026 | 2:56 AM

ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులపై చర్యలు ఉండేనా?

30-06-2026 01:58 AM

నిర్లక్ష్యపు విద్యుత్ శాఖ మండల అధికారి ఏఈపై ఫిర్యాదు

జగదేవపూర్, జూన్ 29: జగదేవపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి,తిమ్మాపూర్ గ్రామల్లో నెలకొన్న విద్యుత్ సమస్య ల పై తిమ్మాపూర్ సర్పంచ్ రాజు, వట్టిపల్లి ఉప సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు.

ఈ సందర్బంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామంలో ఇండ్ల పై నుండి త్రి పేస్ విద్యుత్ వైర్లు ఉన్నాయని వాటి వాళ్ళ విద్యుత్ షాక్ వచ్చిందని, రోడ్డు పక్కన ఉన్న మరోక విద్యుత్ స్తంభం కేవలం ఇనుప చూవ్వల పై ఆధారపడి ఉందని విరిగిపోయి పడితే ఇండ్లలో విద్యుత్ షాక్ వచ్చే అవకాశం ఉందని గత మూడు నెలల నుండి చెప్పిన వినతి పత్రాలు సమర్పించిన జగదేవపూర్ విద్యుత్ శాఖ ఏ ఈ పట్టించు కోవడం లేదని అన్నారు.

గజ్వెల్ లో (డి,ఈ)డివిజనల్ అధికారికి సైతం దరఖాస్తు ఇచ్చిన్నప్పటికి ఏలాంటి చర్యలు లేవని అన్నారు. వట్టిపల్లి ఉప సర్పంచ్ నాగరాజు మాట్లాడుతు వటిపల్లి గ్రామంలో సింగిల్ పేస్ విద్యుత్ లైన్ ఇండ్ల పైన ఉంది అని చొరవ తీసుకోని మార్చాలి ఎన్ని  సార్లు కోరిన పట్టించు కోవడం లేదని వాపోయారు.

జిల్లా అధికారులు వెంటనే స్పందించి విధులలో నిర్లక్ష్యం వహిస్తు ప్రజల ప్రాణాలతో చాలగటం ఆడుతున్న నిర్లక్ష్యపు అధికారి జగదేవపూర్ ఏ ఈ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో  నాయకులు రాములు,దుబ్బసి సుధాకర్,కె సురేష్,పైసా స్వామి, గుండ్రు స్వామి తదితరులు ఉన్నారు.