టెన్త్ ఫలితాల్లో శ్రీ భార్గవి విజయదుందుభి
అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు
వరంగల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ధృవ శ్రీ భార్గవి హైస్కూల్ విజయదుందుభి మోగించింది. వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో గల ధృవ శ్రీ భార్గవి హైస్కూల్ విద్యా ర్థులు 2025 విద్యా సంవత్సరం ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో అత్యున్నత మార్కులు సా ధించి విజయ ప్రభంజనం సృష్టించారు.
ఎం. సహస్ర(హాల్ టికెట్ నెం.2611108411) 575 మార్కులు, బి.రసజ్ఞ(హాల్ టికెట్ నెం. 2611108449) 566 మార్కులు, ఆర్.నైనిక (హాల్ టికెట్ నెం.2611108231) 557 మా ర్కులు, సమీర్(హాల్ టికెట్ నెం.2611 108 609) 530 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ధృవ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మ న్ ఆకుల శ్రీనివాస్, శ్రీ భార్గవి హైస్కూల్ ప్రధానోపధ్యాయురాలు వి.సువర్ణ అద్భుత ఫలితా లు సాధించడంతో కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు.






