పది ఫలితాల్లో సర్కారీ బడుల విజయం
నంగునూరు, ఏప్రిల్ 29: పదో తరగతి ఫలితాల్లో నంగునూరు మండల ప్రభుత్వ పాఠశాలలు 99.53 శాతం ఉత్తీర్ణత తో అద్భుత ప్రతిభ కనబరిచాయి. మండల వ్యాప్తంగా 10 పాఠశాలల నుంచి 430 మంది విద్యార్థులు పరీక్ష రాయగా,428 మంది (192 మంది బాలురు, 236 మంది బాలికలు) ఉత్తీర్ణులయ్యారు. ముఖ్యంగా నంగునూరు, పాలమాకుల, నర్మెట్ట, గట్లమల్యాల, బద్దిపడగ, అంక్షాపూర్, మగ్దుంపూర్ జెడ్పీహెచ్‌ఎస్ లతో పాటు అక్కెనపల్లి టీజీఎంఎస్ పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి.
నర్మెట్ట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని బి. అమూల్య 587 మార్కులతో మండల టాపర్గా నిలవగా,జి. సహస్ర భారతి (581), బి. అశ్విని (572) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.ఉపాధ్యాయుల కృషి, నాణ్యమైన బోధన వల్లే ఈ విజయం సాధ్యమైందని ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులను పలువురు అభినందించారు.
కోహెడ..
కోహెడ, ఏప్రిల్ 29: కోహెడ హైస్కూల్ విద్యార్థులు పది ఫలితాలలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. శనిగరం గ్రామం హైస్కూల్ విద్యార్థులు 579, సంజన శ్రీనిధి 577 మార్కుల తో మండల టాపర్లు గా నిలిచారు. కోహెడ ఉన్నత పాఠశాల విద్యార్థులు బత్తుల శివాని 563, హర్షవర్ధన్ 562 మార్కులు సాదించారు. మండలం లోని 15 పాఠశాల లో 463 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏంఈఓ పద్మయ్య పేర్కొన్నారు.






