28 July, 2026 | 3:18 PM

బోనం ఎత్తిన శ్రీ చైతన్య సెంట్ పీటర్స్ పాఠశాల

28-07-2026 02:46 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలోనీ శ్రీ చైతన్య సెంట్ పీటర్స్ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ నర్సింహా రెడ్డి ఆషాడ ఉత్సవాలు నిర్వహించారు.విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారి రూపం, పోత రాజు వేష ధరణలో అలరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం పాఠశాలలో ఆషాడ ఉత్సవాలు నిర్వహించడం జరుతుందని ఇలాంటి కార్యక్రమలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్నా కళలు తెలుస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండంట్ లలిత నర్సింహా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, సిబ్బంది రాజేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.