28 July, 2026 | 3:43 PM

'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్ సీడ్ మేళా

28-07-2026 02:57 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా మావల రైతు వేదికలో 'రైతు నేస్తం' వంద ఎపిసోడ్ కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాతావరణంలో ఎల్నినో (El Nino) ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైందని, రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. రైతు వేదికలో నిర్వహించిన సీడ్ మేళాలో కేడీడీ PR4-176 రకం 4 కిలోల ప్యాకెట్ రూ. 520 ధరకే రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని, అలాగే ఉద్యానవన శాఖ ద్వారా కూరగాయల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.